Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. కొనసాగుతున్న సహాయక చర్యలు

Delhi building collapse Five story building collapses and rescue operations underway
Advertisement
  • ఢిల్లీలోని సీమాపురిలో కూలిన ఐదంతస్తుల భవనం
  • శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం
  • ఘటనా స్థలంలో ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
  • ఆ ప్రాంతానికి రావొద్దని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచన
Advertisement
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి.

మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో భవనం కూలినట్లు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం శిథిలాలను తొలగించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. సహాయక చర్యల్లో ఫైర్ సర్వీస్ సిబ్బందితో పాటు స్థానికులు కూడా భాగస్వాములవుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు కొందరు కాంక్రీట్ పెళ్లలను చేతులతో తొలగించే ప్రయత్నం చేస్తుండగా, మరికొందరు ఈ విషాద దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు.

ఈ ప్రమాదం దృష్ట్యా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. అంబులెన్సులు, సహాయక వాహనాలు వేగంగా ఘటనా స్థలానికి చేరుకోవడానికి వీలుగా సీమాపురి గోల్ చక్కర్, డీఎల్ఎఫ్ భోపురా పరిసర ప్రాంతాలకు ప్రజలు ఎవరూ రావొద్దని 'ఎక్స్' వేదికగా విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజుల క్రితమే సత్యనికేతన్ ప్రాంతంలో ఓ హాస్టల్ భవనం కూలి ఏడుగురు మరణించిన ఘటన మరువక ముందే, మరో భవనం కుప్పకూలడం ఢిల్లీ వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
Advertisement
Advertisement
Delhi building collapse
Seemapuri
Delhi Fire Service
Northeast Delhi news
Five story building collapse

More Telugu News